Saturday, 13 August 2011

నువ్వు గాలివి
నేను చెట్టుని

నువ్వేమన్నా తల ఊపడమే
నా పని
మధ్యతరగతి ఇల్లాలి నగలు....
మార్వాడీకొట్లో
విశ్రాంతి తీసుకుంటున్నాయి!!!
ఎప్పటికీ ఇంటికి చేరునో???!!
ఆకాశం
అదేపనిగా
ఎన్నిసిగరెట్లు కాలుస్తోందో ఏమో..
లేకపోతే
ఇన్ని పొగమబ్బులెక్కడివీ?
పొదుపుగా
వాడుకోవాల్సింది..
నీళ్ళనే కాదు,
కన్నీళ్ళని కూడా!!
 

No comments:

Post a Comment