Saturday 13 August 2011

కౌమారంలో కవిత్వం-అదొక పైత్యం

వెన్నెల తాగిన
నీలి రంగు కళ్లు
చంద్రబింబం లాంటి ముఖం
****** ఆమె పేరు!

*
ఆమె మళ్ళీ కనిపించింది.
నా గుండె మళ్ళీ లయ తప్పింది.
ఆమె స్నేహం లభించడం
నా జీవితంలో నేనెదుర్చూడని
వో గొప్ప వరం.

*
ఆమె చాలా సార్లు
కళ్ళతోనే మాట్లాడేది.
యింకాస్సేపు వుంటుందనుకునేంతలో
లేచి వెళ్ళిపోయింది.

*
ఆమెలో చిలిపితనం పాలు యెక్కువ.
నా సమక్షంలో
ఆమె ముఖంలో
అనాచ్చాదిత మెరుపుల్ని చూసేవాన్ని .

*
నాలో యెన్నో భావాలు చెలరేగేవి.
చాలాసార్లు మౌనమే దొర్లేది.

*
ఆమె అతడిని పరిచయం చేసింది.
వాళ్ళిద్దరూ
గాఢస్నేహితుల్లా మట్లాడుకున్నారు.

*
ఆమె కళ్ళలో
నా కోసం ఆసక్తికోసం వెతికేవాణ్ణి.
ఆ విషయం
ఆమె గమనించినట్టు కనిపించేది కాదు.


మె కళ్ళు ఎప్పుడూఉత్సాహంతో మెరుస్తుండేవి.
ముఖంలో లీలా మాత్రంగా
అతనిపట్ల సాన్నిహిత్యం
ద్యోతకమయ్యేది.

*
ఆమె నవ్వులో విషాదమో లేక
నా పట్ల అనురాగమో
అర్థం అయ్యేది కాదు.

*
అతను ఉత్సాహంగా కనిపించేవాడు .
నేను దిగాలుగా, బిడియంగా.

*
ఆమె మాటలు
నిగూఢమైన చీకటిలా అనిపించేవి.
నాకోసం యేమైనా
ప్రేమ దాచుకుందేమోనని
నాలో వొక ఆశ
*
ఆమె గొంతులో
యెపుడూ యేదో వొకలాంటి
హుషారు తొణికిసలాడినా
నాలో యేవో విషాద తంత్రుల్ని
మీటేదిగా వుండేది.

*
అతడి రాక పూర్వం
ఆమె నవ్వులో విచారం.
*
అతడి రాక పూర్వం
ఆమె నవ్వులో విచారం.
నేనా విషయం కదపలేదు.
అతడి ఆగమనం ఆమెను సంతోషపరిచేది.

*
నాలో ఆమె పట్ల ప్రేమ పెల్లుబికేది.
అది కాంక్షేమోనని
భయపడతాను.

*
నాలో ఆమెపట్ల ప్రేమ
చాలా సంకుచితమనీ
నాలో వొక
నేను వెళ్ళేసరికి
వాళ్ళిద్దరూ నవ్వుతో మాట్లాడుతున్నారు.
అతడి కళ్ళలో అయిష్టం.
ఆమె కళ్ళలో నవ్వు.

*
నేనెన్నో విషయాలు చెప్పాలనుకున్నాను.
ఆమె ముఖంలో
యే భావమూ కనిపించలేదు.
యింతలో అతను వొచ్చాడు.
నేనూ మౌనం వహించాను.

భయం.
నా ప్రేమ విషయం
వాయిదా వేస్తూ వచ్చాను.
హఠాత్తుగా ఆమె చూపులు
దయాపూరితంగా అనిపించేవి.

*
చలికాలపు యెండలంటే
ఆమెకు చాలా ఇష్టం.
అతడి గురించి ఆమె
యెన్నో విషయాలు చెప్పేది.
నేను సెలవు తీసుకున్నాను.
అతడు యెందుకో
మరింత ఉల్లాసంగా కనిపించాడు.
ఆమె ముఖంలో నాకే భావమూ స్ఫురించలేదు.

*
అతడిని
గొప్ప స్నేహితుడిగా వర్ణించేది.
హఠాత్తుగా ‘మరి నువ్వూ అనుకో’ '
అంటో నవ్వేది.

*
ఆమె మాటలంటే
నాకు చాలా ఇష్టం
యెక్కువగా అతడి గురించే ప్రస్తావించినా.


అతడేదో ఖరీదైన బహుమానం యిచ్చాడామెకు.
నేను మర్చిపోయానని చెప్పాను.
బదులుగా నవ్వి వూరుకుందామె.

*
అతడిపై నాలో ఎలాంటి భావమున్నా కాని
నాపై దయను ప్రసరింపజేసే
చూపులు కరువయ్యాయని నాలో కలవరం.

*
నా ప్రేమ విషయం
నాలోనే మరుగున పడిపోయింది.
అందమైన కళ్ళున్న ఆమెను
బాధ పెట్టడం నాకిష్టం లేకపొయింది.

*
ఆమె వీడుకోలుగా నవ్వింది
వెన్నెల చిలకరించినటు.
నా రెప్ప తడిసిం

1 comment: